• +91 92463 77055
  • info@kabconsultants.com
  • 92463 77055

News

మే 26, 27న ఎంసీఏ, ఎంబీఏ అర్హత పరీక్ష

తెలంగాణ లో 2023-24 విద్యా సంవత్సరానికి గాను ఎంసీఏ, ఎంబీఏ కోర్సుల్లో అడ్మిషన్లు పొందడానికి కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో మే 26, 27 తేదీల్లో అర్హత పరీక్ష నిర్వహించనున్నట్టు రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి తెలిపారు.

తెలంగాణ లో 2023-24 విద్యా సంవత్సరానికి గాను ఎంసీఏ, ఎంబీఏ కోర్సుల్లో అడ్మిషన్లు పొందడానికి కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో మే 26, 27 తేదీల్లో అర్హత పరీక్ష నిర్వహించనున్నట్టు రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి తెలిపారు. మంగళవారం కేయూలోని సెమినార్‌ హాల్‌లో ఈ పరీక్ష పో స్టర్‌ విడుదల చేశారు. ఐసెట్‌కు 14 ప్రాంతీయ కేంద్రాలను, 75 పరీక్ష కేంద్రాలను ఏర్పా టు చేయనున్నట్టు పేర్కొన్నారు. మంగళవారం నోటిఫికేషన్‌ విడుదల కాగా మార్చి 6 నుంచి మే 6 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఎస్సీ, ఎస్టీలకు దరఖాస్తు రు సుము రూ.550, ఇతరులకు రూ.750 ఉం టుందని తెలిపారు. 250 రూపాయల అపరాధ రుసుముతో మే 12 వరకు, రూ.500 అపరాధ రుసుముతో మే 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.

ఈ పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్‌ను మే 22 నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలని, ఈ పరీక్షను మే 26, 27న ఉదయం 10 నుంచి మధ్యా హ్నం 12.30 వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 వరకు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ఈ ఫలితాల తొలి కీ జూ న్‌ 5న విడుదల చేస్తామని, అభ్యంతరాలు ఏమైనా ఉంటే జూన్‌ 8 వరకు తెలుపాలని కోరారు. పూర్తి ఫలితాలను జూన్‌ 20న విడుదల చేయనున్నట్టు వెల్లడించారు. దరఖాస్తులను ఆన్‌లైన్‌ ద్వారా సమర్పించాలని కోరారు.