• +91 92463 77055
  • info@kabconsultants.com
  • 92463 77055

News

TS Inter Results 2021: ఇంటర్‌ సెకండియర్‌ ఫలితాలు విడుదల

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ఇంటర్‌ సెకండియర్‌ ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. విద్యాశాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఫీజు చెల్లించిన 4,51,585 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 1,76,719 మంది  ‘ఏ’ గ్రేడ్‌... 1,04,888 మంది ‘బీ’ గ్రేడ్‌ సాధించారు. ఇక 61,887 మంది ‘సీ’ గ్రేడ్‌... 1,08,093 మంది ‘డీ’ గ్రేడ్‌లో ఉత్తీర్ణులయ్యారు. కాగా ఫస్టియర్‌ మార్కుల ఆధారంగా సెకండియర్‌ మార్కులు కేటాయించారు. ఇంటర్‌ సెకండియర్‌ ప్రాక్టికల్స్‌కు వందశాతం మార్కులు ఇచ్చారు. కాగా మంగళవారం వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలు అందుబాటులోకి రానున్నాయి.

ఇక మహమ్మారి కరోనా వ్యాప్తి కారణంగా ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ విద్యార్థులను ప్రమోట్‌ చేసి, సెకండియర్‌ పరీక్షలను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. ద్వితీయ సంవత్సర విద్యార్థులకు మార్కులు కేటాయించే విధానంపై ఏర్పాటు చేసిన కమిటీ చేసిన సిఫారసులను ప్రభుత్వం ఆమోదించింది. ఈ నేపథ్యంలో ఫలితాల వెల్లడికి మార్గం సుగమమైంది.